తిరుపతిలో ఆటో దందా బీభత్సం..!!
రైల్వే స్టేషన్ వద్ద భక్తుడిపై దాడి – తీవ్ర గాయాలు
శ్రీనివాస మంగాపురం ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఘటన
ఆటో డ్రైవర్ చేప్పిన రేటు నిరాకరించగానే దాడి.!
భక్తుడిని దారుణంగా కొట్టిన ఆటోవాలా
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
రైల్వే స్టేషన్ వద్ద ఆటోవాలాల దందా రోజురోజుకి పెరుగుదల
తిరుపతి, ఆగస్టు 8: తిరుపతిలో భక్తుల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టుకు వెళ్లే ఫ్రీ బస్ స్టాప్ వద్ద ఆటో డ్రైవర్లు భక్తులపై దాడికి తెగబడ్డారు. ఆటో డ్రైవర్ చెప్పిన అధిక చార్జీని ఒక భక్తుడు నిరాకరించడంతో, ఆగ్రహంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఈ దాడి దృశ్యాలు అక్కడి ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, రైల్వే స్టేషన్ వద్ద ఆటో దందా రోజురోజుకి విపరీతంగా పెరుగుతోందని, భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేసి, నిరాకరించిన వారిపై దాడులు జరగడం మామూలైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.