హ్యాండ్‌బ్యాగ్ మర్చిపోతే… నిజాయితీతో స్పందించిన ఆటో డ్రైవర్
– పోలీసుల ద్వారా యజమానికి సురక్షితంగా అందజేత
షామిర్‌పేట్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పరిధిలో ని,జూలై 26 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ యువతి షామిర్‌పేట్ ప్రాంతంలో ఆటో (TS 36 TA 3028)లో ప్రయాణించి హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయింది. డ్రైవర్ నంద కిషోర్ తన ఆటోలో ఉన్న బ్యాగ్‌ను గమనించి, వెంటనే షామిర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి అప్పగించాడు.పోలీసులు విచారణ జరిపి బ్యాగ్ ఆల్వాల్‌కు చెందిన నల్లగళ్ల రాణిదని గుర్తించారు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హ్యాండ్‌బ్యాగ్‌ను అందజేశారు. బ్యాగ్‌లో మొబైల్ ఫోన్, నగదు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిసింది.బ్యాగ్ మిస్సవడంతో తీవ్రంగా కలవరపడ్డ రాణి, చివరికి పోలీసుల నుండి వచ్చిన సమాచారం ద్వారా ఊపిరి పీల్చుకుంది. అన్ని వస్తువులు సురక్షితంగా ఉండటంతో నమ్మకంగా అనిపించిందని చెప్పింది.పోలీసులు ఆటో డ్రైవర్ నంద కిషోర్‌ను సన్మానించి, సమాజంలో ఇలాంటి చర్యలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.