రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సన్మానం

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సన్మానం

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా నవంబర్ 16

 

 

 

జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరహరి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి, ప్రభుత్వం–ప్రజలకు వారధిగా నిలుస్తున్నారని, వారి సేవలు అమూల్యమని వారు పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేసి చైతన్యం కల్పించే పాత్రికేయుల పాత్ర కీలకమని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్లు గౌడ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణహరి, కోశాధికారి పర్ష వెంకటరమణ, వ్యాఖ్యాత అంబీర్ మనోహర్ రావు, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కార్యక్రమ చైర్మన్ పోలబోయిన సత్యం, రొటేరియన్లు రాజ నరసింహం, నాగభూషణం, నవీన్, విజయ్, పాత్రికేయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now