నర్సాపూర్, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో 2025 సంవత్సరం జరిగిన పదోన్నతులలో బయోసైన్స్ విభాగం నుంచి గెజిటెడ్ హెచ్ఎం, ఎస్ జీటీ నుండి బయో సైన్స్ స్కూల్ అసిస్టెంటుగా ప్రమోషన్ పొందిన వారికి, జీవశాస్త్ర విభాగం నుంచి 2025 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన బయోసైన్స్ ఉపాధ్యాయులకు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి రాధాకిషన్ హాజరై మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యుగంలో, ఉపాధ్యాయులు అందరు డిజిటల్, టెక్నాలజీని కూడా తమ బోధనలో వాడుతూ, శిక్షణల ద్వారా, బోధనను మెరుగు పర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బయో సైన్స్ ఫోరమ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సైన్స్ పరీక్షను, 10వ తరగతిలో వేరు వేరుగా రీసల్ట్ వచ్చే విధంగా, ఫీజికల్ సైన్స్ లో ఫెయిల్ అయిన వారు, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఫెయిల్ అయిన వారు బయోసైన్స్ మాత్రమే రాసే విధానం ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయో సైన్స్ ఫోరమ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, జిల్లా ఏఎంవో సుదర్శన మూర్తి, సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, ఏఎస్ వో నవీన్ కుమార్, ఫోరమ్ కోశాధికారి రమణ కుమార్, జిల్లా బాధ్యులు అరుణ, చంద్ర శేఖర్,నాగరాజు, నశిరుద్దీన్, ప్రశాంతి, ఇందిర, సృజన, శ్రవణ్ వివిధ మండలాల బాధ్యులు మహేందర్ రెడ్డి, రేఖ, గోపాలరెడ్డి,రాజారత్నం, అరుణకుమారి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం
Oplus_16908288