లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

IMG 20240910 150425

సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): వృత్తులన్నిటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైందని, దేశాభివృద్ధికి మూలస్థంబాలైన భావి భారత పౌరులను తయారు చేయు బాధ్యత ఉపాధ్యాయుల చేతిలో ఉందని, ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రీజియన్ చైర్మన్ లయన్ యన్. కరుణాకర్ గౌడ్ అన్నారు. భారత దేశ ద్వితీయ రాష్ట్రపతి, విద్యావేత్త, తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంను లయన్స్ క్లబ్ ఆఫ్ అమీన్ పూర్ ఆధ్వర్యంలో కో ఆఫీసర్ లయన్ పి.రామ నర్సింహా రెడ్డి అధ్యక్షతన అమీన్ పూర్ లోని బృందావన్ టీచర్స్ కాలనీలోని క్లబ్ హౌస్ లో ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. అమీన్ పూర్, జిన్నారంలలోని పది మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలు, మెమంటో, శాలువాలు, సర్టిఫికెట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ లయన్ యం.వెంకటేశం లయన్స్ క్లబ్ ఆశయాలను, చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్య క్రమములో క్లబ్ అధ్యక్షుడు బి. కృష్ణాగౌడ్, కార్యదర్శి కే. నాగరాజు, కోశాధికారి కే. సిద్దిరాములు, డిస్ట్రిక్ట్ చైర్మన్ జి. అశోక్ బాబు, జోన్ చైర్మన్ లయన్ మంగళపర్తి వెంకటేశం, రీజియన్ కార్యదర్శి సుధీర్ మణికొండ, జియస్ టి చైర్మన్ పి.సురేందర్, లయన్ సభ్యులు వెంకటేశం, కృష్ణాగౌడ్, కరుణాకర్ రెడ్డి, నాగభూషణం, ఆంజనేయులు, జి. లింగం, కాలనీ వాసులు రమాకాంత్, సంతోష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now