*బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలకు సన్మానం*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 24*
ప్రపంచంలో అత్యుత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అటువంటి వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో 2024 బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గార్డియన్ స్కూల్ లో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న, బాలసాని శోభ, బడుగు మమత లకు మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయ సర్టిఫికెట్, మెమొంటో, శాలువాతో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు చేతుల మీదుగా అవార్డు పొందారు. బెస్ట్ టీచర్స్ అవార్డు పొందిన తమ పాఠశాల ఉపాధ్యాయురాలను పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ అంకుష్ శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించే వారికి గుర్తింపు ఉంటుందని ప్రపంచంలో అత్యుత్తమమైన వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ప్రధానమైనదని ఎన్ని కోట్లు సంపాదించిన విద్యార్థుల ప్రేమ, అభిమానాల ముందు తక్కువే అని అందుకే తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.