దోమల నివారణ, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

దోమల నివారణ, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

అంబేద్కర్ కాలనీలో వైద్య శిబిరంలో

డాక్టర్ మహోన్నత పటేల్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి

జమ్మికుంట జూలై 24 ప్రశ్న ఆయుధం

గురువారం రోజున వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధి అంబేద్కర్ కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో 54మంది కాలనీ ప్రజలకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు 4 గురు జ్వర పీడితులకు రక్త నమూనాలను సేకరించి, వ్యాధి నిర్దారణ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగింది ఈ శిబిరానికి వచ్చిన ప్రజలకు అసంక్రామిత వ్యాధులు రక్త పోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు అందించారు అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి కాలనీ వాస్తవ్యులకు సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గున్య మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత డ్రైడే ప్రత్యేకత గురించి దోమల నివారణ అవి కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కాలనీ ప్రజలకు అవగాహన కల్పించనైనది ఈ కార్యక్రమములో డాక్టర్ మహోన్నత పటేల్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్ వైజర్స్ రత్నకుమారి అరుణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్,ఏఎన్ఎంలు మంజుల రజిత ఆశా కార్యకర్తలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now