రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నేరుగా రైతులకు పంటలపై అవగాహన సదస్సు
జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం జూలై 23
మండల కేంద్రంలోని రైతు వేదికలో అధిక వర్షాపాతం వలన పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇల్లందకుంట మండల రైతులకు నేరుగా తగు సూచనలు వ్యవసాయ శాస్త్రవేత్తలు చేశారు ఈ ప్రాంతంలో సాగు చేసే వరి ప్రత్తి పంటలకు సంబంధించిన సాగులో ఎదుర్కొంటున్న సస్యరక్షణ( తెగుళ్లు) పురుగు నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఏ డి ఏ జి సునీత మండల వ్యవసాయ అధికారి జి రజిత వ్యవసాయ విస్తరణ అధికారులు ఎన్ తిరుపతి, సిహెచ్ రాకేష్, మమత రైతులు తదితరులు పాల్గొన్నారు