కేంద్ర ప్రభుత్వ పి ఎం ఉచ్ఛతార్ శిక్షా ప్రోత్సాహన్ యోజన మెరిట్ స్కాలర్ షి ప్ ల పై విద్యార్థులకు అవగాహన సదస్సు
జమ్మికుంట జూలై 24 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధానమంత్రి ఉచ్ఛతార్ శిక్షా ప్రోత్సాహన్ యోజన మెరిట్ స్కాలర్ షిప్ పైన విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేష్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం మెరిట్ స్కాలర్ షిష్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ స్కాలర్ షిప్ రావాలంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఉత్తీర్ణులై అందులో 80% మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు అని స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసే విద్యార్థులు ఏ ఇతర స్కాలర్ షిప్ పొందుతూ ఉండకూడదని కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల లోపు ఉండాలని స్కాలర్ షిప్ కు ఎంపిక అయిన విద్యార్థులకు డిగ్రీ మూడు సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం 12,000/-, రెండవ సంవత్సరం 12,000/-, మూడవ సంవత్సరం 12,000/- రూపాయల స్కాలర్ షిప్ అందుకుంటారని తెలిపారు ఈ కార్య క్రమంలో స్కాలర్ షిప్ ఇంఛార్జీ పి.శ్రీనివాస్ రెడ్డి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. ఓదెలు కుమార్ డా.కె. రాజేంద్రం డా.కె.గణేష్ డా. రవి సాయికుమార్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.