Site icon PRASHNA AYUDHAM

ఆర్జుకేటీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై అవగాహన సదస్సు

ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై సదస్సు

ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

ఆర్జీయూకేటీ బాసర ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ & రీసెర్చ్, చండీగఢ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై రెండు వారాలపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఇంజనీరింగ్ విద్యలో ఫిజిక్స్ పాత్ర ప్రధాన భూమిక వహిస్తుందని తెలిపారు. అధ్యాపకులు తమ తమ రంగాలలో అత్యాధునిక సాంకేతికతలతో తమను తాము అప్‌డేట్, అప్‌గ్రేడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన సేవలందించగలరని, భవిష్యత్తులో అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు.
సిమ్యులేషన్ టూల్స్, ప్రపోజల్ రైటింగ్, మాన్యుస్క్రిప్ట్ రైటింగ్, ఫిజిక్స్‌లో AI టూల్స్, క్రిస్టలోగ్రఫీ, మాగ్నెటిక్ మెటీరియల్స్ వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సదస్సులో చర్చించడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సదస్సు లక్ష్యాన్ని కన్వీనర్ డాక్టర్
చాంద్ రాకేష్ రోషన్ వివరిస్తూ IIT, NITల నిపుణులచే ఉపన్యాసాలు చర్చలు ఉంటాయని తెలిపారు. “అడ్వాన్సింగ్ సైన్స్ త్రూ సిమ్యులేషన్ – కంప్యూటేషనల్ మెథడ్స్ ఇన్ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఫిజిక్స్” అనే అంశంపై డాక్టర్ చాంద్ రాకేష్ రోషన్ నిపుణుల చర్చ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రణధీర్ సాగి, డాక్టర్ దేవరాజు, HoD ఫిజిక్స్ మరియు వివిధ విభాగాల అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version