శరీర అవయవ దానాలపై అవగాహన సదస్సు
గూడూరు సీతామహాలక్ష్మి
హైదరాబాద్ ( ప్రశ్నఆయుధం ప్రతినిధి ) అక్టోబర్ 25
రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం,వినోబా నగర్ లో గల సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో శరీర మరియు అవయవదానం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ డాక్టర్ ఎస్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకులు గూడూరు సీతామహాలక్ష్మి ముఖ్య అతిధి గా హాజరై,అవయవ దానం అనేది ప్రతి విద్యావంతుడి యొక్క సామాజిక బాధ్యత అని,రెండు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నామని,యువత ఈ అంశం మీద దృష్టి సారించాలని తద్వారా మానవత్వాన్ని చాటుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థినీ,విద్యార్థులను ఉద్దేశిని ప్రసంగించారు.
విశిష్ట అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్..శేఖర్ బాబు ,ఫైనాన్స్ ఆఫీసర్ ఎస్.విజయలక్ష్మి హాజరై ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు చాలా గర్వకారణం అని,విద్యార్థులను భవిష్యత్తులో కూడా ఈ అంశంపై వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తామని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో..,
తెలంగాణ అవయవ దాన ఉద్యమకారులు .జి.గురు ప్రకాష్ .లయన్ రామచంద్ర రావు ,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లిక్కి.అనురుద్రా రెడ్డి ,తెలంగాణ అధ్యక్షురాలు .కవిత ,నేషనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ సొంటె ,బ్లడ్ డొనేషన్ కార్యకర్తలు సంతోష్ కుమార్,నిహారిక దంపతులు తదితరులు పాల్గొన్నారు.