టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు

*కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో టిబి వ్యాధిపై అవగహన సదస్సు*

*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా డిఎం &హెచ్ ఓ ఆదేశాల మేరకు క్షయ నివారణ విభాగం టీబి అలర్ట్ ఇండియా -ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ వారి సహకారంతో వావిలాల పి హెచ్ సి పరిధిలోని ఆబాది జమ్మికుంట ఏఏఎం సెంటర్ డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో శుక్రవారం కేశవపూర్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో టీబి వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం క్షయ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకూడదని వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని పాఠశాలలోని బాలికలకు అవగాహన కల్పించారు టీబీ వ్యాధి వ్యాపించు విధానం వ్యాధి లక్షణాలు , తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి క్లుప్తంగా వివరించారు. అందరు టిబి వ్యాధి పైన అవగాహన కలిగి వుండాలని మంచి ఆహారం తీసొకొవాలని వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావాలని బాలికలకు సూచించారు ఈ శిక్షణా కార్యక్రమం కొరకు హెల్త్ సబ్ సెంటర్ వారీగా పిహెచ్సి సిబ్బంది సహకారంతో క్షయ వ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయ వ్యాధి నివారణ పై శిక్షణ ఇచ్చారు.శిక్షణ అనంతరం వారిచే గ్రామాలలో పాఠశాలలో కళాశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం టిబి వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపుతూ వారిని వ్యాధినుండి విముక్తులను చేయడం జరుగుతుందని వివరించారు ఈ కమ్యూనిటీ ఎంగేజిమెంట్ కార్యక్రమాల ద్వారా కరీంనగర్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని ప్రాజెక్ట్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. పాఠశాల లోని బాలికలకు వ్యక్తి గత పరిశుభ్రత చేతుల పరిశుభ్రతల పై అవగాహ కల్పించారు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ,ఆడపిల్ల సృష్టికి మూలం కాబట్టి ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్లలను ఎదగ నిద్దాం ఆడపిల్లల పట్ల శ్రద్ద పెడదాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యా రాణి, హెల్త్ ఎడుకేటర్ మోహన్ రెడ్డి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుప్రియ ఏఎన్ఎం సరళ హెల్త్ అసిస్టెంట్ నరేందర్ ఆశా కార్యకర్త స్వప్న టిబి అలెర్ట్ ఇండియా కమ్యూనిటీ కో ఆర్డినేటర్ తిరుపతి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now