Site icon PRASHNA AYUDHAM

వాక్స్ సంస్కరణలపై అవగాహన సదస్సు

IMG 20250421 WA3080

*వాక్స్ సంస్కరణలపై అవగాహన సదస్సు*

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21

బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్స్ సంస్కరణల అవగాహన సదస్సులో మాజీ మంత్రి ఈటల రాజేందర్, నాగారం మున్సిపల్ మాజీ ఛైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వాక్స్ ఆస్తుల నిర్వహణ, పేద ముస్లింలకు వాటి ఫలాలు అందకపోవడంపై వారు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో లక్షల ఎకరాల వాక్స్ భూములు పేద ముస్లింలకు విద్య, వైద్యం అందించడంలో ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “కేవలం ఐదు శాతం మంది ముస్లింలు మాత్రమే ఈ ఆస్తులను అనుభవిస్తున్నారు. 95 శాతం నిరుపేద ముస్లింలకు వాటి ఫలాలు అందడం లేదు” అని ఆయన అన్నారు.

కౌకుంట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలైన ముస్లింల తలరాతలు మార్చేందుకు బీజేపీ కంకణబద్ధమైందని తెలిపారు. “నరేంద్ర మోడీ ప్రభుత్వం వాక్స్ ఆస్తులను పేద ముస్లింలకు అందించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం” అని ఆయన అన్నారు. “పేద ముస్లింలకు న్యాయం జరిగేలా బీజేపీ కృషి చేస్తుంది” అని ఆయన హామీ ఇచ్చారు.

Exit mobile version