ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఎస్సై మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మండల పరిధిలోని అన్ని ఆటోలకు సీరియల్ నెంబర్స్ ను ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్ల వివరాలు స్టేషన్ లవారిగా నమోదు చేసుకున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తించడం కోసం ఆటోలకు సీరియల్ నెంబర్స్ వేసినట్టు వారు తెలిపారు.