Site icon PRASHNA AYUDHAM

ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన

IMG 20240805 WA0666

ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన గజ్వేల్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ నిర్వహించిన డీలర్లకు అవగాహన కార్యక్రమం లో భారతదేశము స్వదేశీ విజ్ఞాన పరిజ్ఞానంతో మార్కెట్లోకి విస్తరిస్తున్న బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ వారు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు.ఈసందర్భంగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వ్యవసాయ రంగంలో వచ్చు నూతన సవాళ్లను స్వీకరిస్తూ అగ్రగామి సంస్థగా భారత దేశంలో అడుగుపెడుతున్న సంస్థల్లో బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. కంపెనీ 450 క్రిమిసంహారక ఉత్పాదకాలను రిజిస్ట్రేషన్ చేయబడిందని 40 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి బెస్ట్ ఆగ్రో లైఫ్ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో మార్కెట్లోకి ఆరు నూతన ఉత్పత్తులను విడుదల చేయడం జరిగిందని అందులో వార్డెన్ ఎక్సట్రా, ఒరుసేలం, నిమజిన్, డిపేండర్, స్పైనో షర్, స్పైటోకాన్, అనే రకాల మందులని పేర్కొన్నారు.ఉత్పత్తులకు సంబంధించి టెక్నికల్ ప్రజెంటేషన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సారా నరసయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఏ. వెంకట్ రెడ్డి , ఏజీఎం బొజ్జం వెంకటేష్, సీనియర్ రీజినల్ మేనేజర్ రావుల నరేష్ రెడ్డి, ఫీల్డ్ మార్కెటింగ్ ఆఫీసర్ దుంబాల దినేష్ , కంపెనీ మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా సుమారు 150 మంది డీలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెర్రటరీ సేల్స్ మేనేజర్లు మధుసూదన్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ చిట్టా పురం కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version