ధర్మారావుపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సిపీఆర్‌పై అవగాహన

ధర్మారావుపేట్ జెడ్పీహెచ్‌ఎస్‌లో సిపీఆర్‌పై అవగాహన

విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ… ప్రాణాలను కాపాడగలిగే నైపుణ్యం నేర్పిన స్వచ్ఛంద సంస్థలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20

జెడ్పీహెచ్ఎస్ ధర్మారావుపేట్ పాఠశాల విద్యార్థులకు సిపిఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని యూఎస్ఏకు చెందిన ‘బ్రింగ్ బ్యాక్ ద బీట్’ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణకు చెందిన ‘హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కృష్ణకర్‌రావు మాట్లాడుతూ… ఆకస్మిక గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, కరెంటు షాక్ వంటి ప్రమాదాల సమయంలో వెంటనే సిపీఆర్ ప్రారంభిస్తే ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సుమారు 80 శాతం మంది సిపీఆర్ చేయకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. సిపీఆర్‌పై అవగాహన పెంపుతో ఎన్నో అమూల్యమైన ప్రాణాలు నిలబెట్టవచ్చని చెప్పారు.తదనంతరం విద్యార్థులతో సిపీఆర్ ప్రాక్టికల్‌ డెమో నిర్వహించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా సిపీఆర్ ఎలా చేయాలనే విషయాన్ని ప్రాక్టీస్‌ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, దయానంద్, రాజు, స్వామి, శ్రీనివాస్, సుగుణ, చిన్నయ్య, విజయశ్రీ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now