సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై అవగాహన

సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై అవగాహన

ఎస్‌ఎస్ నగర్ జూనియర్ కళాశాలలో పోలీస్ కళాబృందం చైతన్య కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం అక్టోబర్) 10

 

కామారెడ్డి జిల్లా ఎస్‌ఎస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌ఐ ఎం.ఎ.ఎం. సిద్ధిక్వి, ఏఎస్‌ఐ జగదీష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పీసీ ప్రవీణ్ సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించి 1930 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఉపయోగించాలన్నారు. ఎల్లారెడ్డి షీ టీమ్స్ సభ్యులు పీసీ శ్రీశైలం, డబ్ల్యూపీసీ సుప్రజ మహిళల భద్రతపై సూచనలు ఇచ్చి షీ టీమ్స్ నంబర్ 8712686094, అత్యవసర సమయాల్లో డయల్ 100 ను వినియోగించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల వినియోగం వంటి విషయాలపై పీసీ రాజేందర్ చైతన్యం కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాలు, లైంగిక దాడులపై భరోసా టీం అవగాహన కల్పించింది. సోషల్ మీడియాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్‌ఛార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యు.శేషారావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటల మాటల ద్వారా విద్యార్థులకు చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment