సైబర్ క్రైమ్ పై అవగాహన…

బోర్లం ఉన్నత పాఠశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం

పట్టణ సీఐ మున్నూరు క్రిష్ణ

ప్రశ్న ఆయుధం 24 జూలై(బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ మండలంలోని బోర్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ పట్టణ సిఐ కృష్ణ హాజరయ్యారు.బాన్సువాడ పట్టణ సీఐ కృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు.సోషల్ మీడియా లో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ,వాట్సాప్ ఇతర యాప్లలో జరుగుతున్నతున్న మోసాలను తెలియజేశారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేయడం చేసుకోవడం నేరంగా పరిమించబడుతుందని,ఎవరైనా ఆడపిల్లల్ని వేధిస్తే ఫోక్సో చట్టం ద్వారా చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఆడపిల్లలకు ఎవరైనా వేదించిన అసభ్యంగా ప్రవర్తించిన షీ టీంకు లేదా 100కు డయల్ చేసి మీ సమస్యలను తెలియజేయాలని,అలా ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు.పాఠశాల దశ నుంచే విద్యార్థులు సోషల్ మీడియాలో నిమగ్నమై పరిచయం లేని వ్యక్తుల ద్వారా స్నేహాన్ని కొనసాగించి మోసపోతున్నారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని,జ్ఞానానికి సంబంధించిన విషయాలను మాత్రమే చూడాలని ఏ ఇతర యాప్ లను,లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని,ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు మీ
వీటిపైన అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో,పాఠశాల ఉపాధ్యాయులు,పద్మ శ్రీనివాస్, సరిత,అయ్యాలా సంతోష్,నరసింహ చారి,ఆనంద్,రాజు, సంగమేశ్వర్,శ్రావణ్ ,గంగాధర్ తేజ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now