పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన

– జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

*గజ్వేల్ , జనవరి 06

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిఎంఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి సోమవారం ఎంపీహెచ్ఎస్ బంగ్లా వెంకటపూర్, గజ్వేల్ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఇంగ్లీష్ సంబంధించి మెలకువలను, పరీక్ష విధానము, గ్రామర్ తదితర విషయాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందము, ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లా వెంకటాపూర్ పాఠశాలకు ఇంగ్లీష్, హిందీ పోస్ట్ లు మంజూరు చేయాలని ప్రభుత్వం ను కోరారు. ఈ పాఠశాలకు మళ్లీ అప్పుడప్పుడు వచ్చి క్లాసులు తీసుకుంటానని విద్యార్థులకు తెలిపారు. పాఠశాల తరఫున గోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Join WhatsApp

Join Now