*ఆయిల్ పామ్ సాగు, మార్కెట్ విధానాలపై రైతులకు అవగాహన సదస్సు..*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి రావిలాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. జమ్మికుంట క్లస్టర్ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగు మార్కెట్ విధానాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా కార్యక్రమానికి హాజరైన డిహెచ్ఎస్ఓ (డిస్టిక్ హార్టికల్చర్ సెరికల్చర్ ఆఫీసర్) శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులకు భావితరాల పంటగా అని సాంప్రదాయ నూనె గింజల కంటే 4 నుంచి 5 రేట్ల అధిక దిగుబడి ఉంటుందని పంట సాగుకు అనుకూలమైన పరిస్థితులు, దిగుబడి వచ్చు విధానం, అమ్ముకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం, మొక్కకు ఇవ్వవలసిన పోషకాలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు, గెలలు కోసే విధానం అంతర పంటలతో వచ్చే ఆదాయం గురించి క్లుప్తంగా వివరించారు. ప్రభుత్వం నుండి కల్పించిన సబ్సిడీ ని ఉపయోగించుకుని రైతులు ఈ పంటను సాగు చేయాలని కోరారు ఆయిల్ ఫామ్ సాగులో అంతర్గత పంటల సాగు విధానంపై కూడా కులం కుశంగా రైతులకు వివరించారు
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి బి. మంజువాణి, వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్, ఏఈవో రాజేష్, రాంప్రసాద్, అచ్యుత్, లోహియా ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.