హెచ్ఐవి ఎయిడ్స్ లపై అవగాహన

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహనతో అంతం…

*డిఎస్ ఆర్సి కౌన్సిలర్ భవిత

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండడంతో వ్యాధిని అంతం చేయవచ్చునని, ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ డిఎస్ఆర్సి కౌన్సిలర్ బత్తుల బబిత అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులచే ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించి కౌన్సిలర్ బబిత మాట్లాడుతూ లారీ డ్రైవర్లు వృత్తిలో భాగంగా చాలా రోజులపాటు ఇంటిని వదిలి సుదూర ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుందని, అలాంటి సమయంలో పర స్త్రీలతో కలవడం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయని డ్రైవర్లకు కు తెలియజేశారు. హెచ్ఐవి సోకిన వ్యక్తులు అధైర్య పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకొని సరియైన మందులు వాడడం ద్వారా ఆ వ్యాధిని పెరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి ఆరోగ్యంతో పాటు మంచి కుటుంబాన్ని ఏర్పరచుకొని ఉండాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని దీని ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మతల గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పొనగంటి మల్లయ్య, అధ్యక్షులు రామస్వామి, ప్రధాన కార్యదర్శి రియాజ్ తోపాటు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now