క్యాసంపల్లితండాలో మానవ హక్కుల అవగాహన..
మానవ హక్కుల సహాయక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎం.ఏ.సలీమ్ కీలక ప్రసంగం.
విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్న వేళ.
గాయత్రి ఆటోమొబైల్స్, శ్రీ సాయి నీది ట్రేడర్స్ తదితరుల సహకారం.
మహిళా హక్కుల నేతలు, న్యాయవాదులు పాల్గొనడం విశేషం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి..ప్రశ్న ఆయుధం, ఆగష్టు2
మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు మానవ హక్కుల సహాయక సంఘం ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎం.ఏ. సలీమ్ విద్యార్థులకు హక్కుల ప్రాముఖ్యత వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి గాయత్రి ఆటోమొబైల్స్ శీల శ్రీనివాస్, శ్రీ సాయి నీది ట్రేడర్స్ కాశీనాథ్, రాఘవేంద్ర ఇండస్ట్రీస్ సహకారం అందించారు.కార్యక్రమంలో రాష్ట్ర మహిళా హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు షబానా, ఉమెన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, న్యాయవాది అనిత, జిల్లా అధ్యక్షుడు మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జమున, ప్రిన్సిపల్ సిద్ధిరాం రెడ్డి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల లో మానవ హక్కులపై చైతన్యం కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని అవసరమని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.