*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై సామాజిక తనిఖీపై అవగాహన*
జమ్మికుంట నవంబర్ 28 ప్రశ్న ఆయుధం*
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జమ్మికుంట మండలంలో 01.04.2023 నుండి 31.03.2024 వ తేదీ వరకు జరిగిన పనుల పై 15వ విడత సామాజిక తనిఖీ చేపట్టుటకు గురువారం జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో సామాజిక తనిఖీ ఏ విధంగా చేయాలో తనిఖీ బృందానికి అధికారులు వివరించారు.జరిగిన పనుల యొక్క రికార్డ్ లు తనిఖీ బృందం నకు అప్పగించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ కే భీమేష్,ఇంచార్జి ఏపీవో లక్ష్మణ్, ఎస్ఆర్పి సుశీల, పంచాయితీ కార్యదర్శులు,టిఏ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.