తార కళాశాలలో విద్యార్థులకు అవగాహన

సంగారెడ్డి, సెప్టెంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, జీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆత్మహత్యల నిరోధ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్నప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆధునిక కాలంలో అనేక కారణాల వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల నేటి యువత ఒత్తిడికిలోనై అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుందని, కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొన్నవాడే సమాజంలో ఎదగలరని, కావున సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కార మార్గాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి కానీ ఒత్తిడికి లోనై క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. మానవ జీవితం అన్ని జీవరాశుల కంటే పవిత్రమైనదని, ఇట్టి అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో కోల్పోరాదని తెలిపారు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయని, సమస్యలు లేని జీవనమే లేదని, సమస్యలు ఉంటేనే మన జీవనానికి అర్థం ఉంటుంది కాబట్టి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని తెలిపారు. విద్యార్థులు ముఖ్యంగా యువత ఎటువంటి క్షణికావేశాలకు లోను కాకుండా ఆత్మహత్యలు చేసుకోరాదని హితవు పలికారు. అనంతరం పాలనాశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ మల్లిక విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జగదీశ్వర్, ఐక్యుఎ సి కో ఆర్డినేటర్ డాక్టర్ మల్లిక, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయకుమార్, డాక్టర్ సుమతి దేవి, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీ రంజిత్ రెడ్డి, ఇతర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now