సిగరెట్ పాన్ గుట్కాల పై విద్యార్థులకు అవగాహన.
ప్రధానోపాధ్యాయులు నాగరాజు.
నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం టొబాకో(పొగాకు) ఉత్పత్తులైన సిగరెట్లు, పాన్, గుట్కా, మొదలగునవి ఉపయోగించడం వల్ల దుష్పరిణామాలు అంశంపై విద్యార్థులకు అవగాహన పెంచుటకు ప్రధానోపాధ్యాయులు నాగరాజు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు వాడడం వల్ల 200 రకాల రసాయనకాలు మానవ శరీరం పైన దుష్పరిణామాలు ఏర్పడి కుటుంబాలు, సమాజం చెడు దారి పడుతుందని వీటివల్ల రోగాలు వచ్చి నోరు,పంటి, గొంతు, ఊపిరి తిత్తులు, రక్తపు క్యాన్సర్ వ్యాధి సోకుతుందని చెడు అలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారని. ఇలాంటి అలవాట్ల వలన విద్యార్థులు యువత చెడిపోతున్నారని విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వంచే నిషేధించబడిన టొబాకో,ఉత్పత్తు లను ఉపయోగించడం వల్ల చదువు పట్ల శ్రద్ధ చూపకపోయే అవకాశం ఉందని. నిషేధిత పదార్థాలను ఉపయోగించుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు అవ గాహన కల్పించామని అలాగే పాఠశాలకు 100 మీటర్ల దూరంలో నిషేధిత ప్రాంతంగా పరిగణిం చాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూపారాణి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, దేవరాజు, శేఖర్& సంధ్య, జ్యోతి, హెల్త్ సూపర్వైజర్, వనజ, ఏఎన్ఎం రమాదేవి, ఆశ వర్కర్ పాల్గొన్నారు.