మారకద్రవ్యాల నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన

*మారకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన*

*విద్యార్థులు మత్తు పదార్థాలకు మార్గ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి*

*ఎక్సైజ్ సీఐ మాధవి లత*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం::-*

మత్తు పదార్థాలకు మారక దవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జమ్మికుంట ఎక్సైజ్ సీఐ మాధవి లత అన్నారు.జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం గంజాయి డ్రగ్స్ మారకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎక్సైజ్ సిఐ మాధవి లత మాట్లాడుతూ మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ మాధవి లత ఎస్సై సౌమ్య ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది కళాశాల యాజమాన్యం లెక్చరర్లు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ టీం సోషల్ వర్కర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment