యువత కోసం కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన

యువత కోసం కేంద్ర, రాష్ట్ర పథకాలపై అవగాహన

ఉప్పల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులో ‘మేరా యువభారత్’ వర్క్‌షాప్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 2

యువత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు ఉప్పల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులో శనివారం ఒక- డే వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ‘మేరా యువభారత్’ రంగారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదువుతున్న, లేదా పూర్తిచేసిన యువత ప్రభుత్వ పథకాల వినియోగం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని సూచించారు. సెట్విన్ ద్వారా అందుబాటులో ఉన్న శిక్షణా, ఉపాధి అవకాశాలపై వివరాలు అందించారు.

జిల్లా యువజన అధికారి టి. ఐజయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు పథకాలు యువతకు ఉపయోగపడేలా రూపొందించబడ్డాయని, వాటి ప్రయోజనాలను ప్రతి యువకుడు తెలుసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధికారులు డీఆర్‌డీఏ డీపీఎం ఆనంద్, ఎల్‌డీఎం శివ ప్రసాద్, డీఐసీ అధికారి మాధురి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ద్వారా కిశోర సంఘాల ఏర్పాటు గురించి ఆనంద్ సూచించగా, శివ ప్రసాద్ ఎంఎస్ఎంఈలు, ఉన్నత విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలపై విశ్లేషణ చేశారు. డీఐసీ ద్వారా అమలవుతున్న పథకాలను మాధురి వివరించారు.

వర్క్‌షాప్‌లో వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు విశ్వనాథ్ కుమార్, ‘మై భారత్’ వాలంటీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment