మాదకద్రవ్యాలు–సైబర్ నేరాల నిర్మూలనపై అవగాహన
కాటేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో పోలీసులు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా
ప్రశ్న ఆయుధం నవంబర్ 20
కామారెడ్డి జిల్లా ఎస్పీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, యువత పెడదారి, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కాటేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దపొడప్గల్ సబ్ ఇన్స్పెక్టర్ G. అరుణ్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా షీ–టీమ్స్ సభ్యులు PC అనిల్, WPC ప్రియాంక విద్యార్థులకు సైబర్ నేరాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
సైబర్ మోసాలపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ 1930, అత్యవసర సమయంలో DIAL 100,
మహిళల సహాయానికి షీ టీమ్ నెంబరు: 8712686094 ఉపయోగించవచ్చని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు, నేరాలకు దారితీస్తాయని పోలీసులు విద్యార్థులకు వివరించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాలు, లైంగిక దాడులపై చట్టపరమైన చర్యలను అవగాహన చేశారు.యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా ఉపయోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవొద్దని సూచించారు.పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PC సాయిలు పాటలు, మాటల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ T. యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, బ్లూ కోట్స్ సభ్యులు పాల్గొన్నారు.