*నేత్ర అవయవ శరీర దానంపై అవగాహన*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 26
ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జరుగబోయే జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు యోగా గురువు యం.నరహరి జమ్మికుంట పట్టణంలోని నిత్య యోగ సాధన సెంటర్ లో శిక్షణ పొందుతున్న వారికి నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు అనంతరం సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం నరహరి మాట్లాడుతూ నేత్రదానం అంటే మొత్తం కనుగుడ్డు తీయడం కాదని కన్ను పైన ఉన్న పల్చని “కార్నియా అనే పొర మాత్రమేనని మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా ఇంటి వద్దనే తీసుకోవడం జరుగుతుందని ఈ కార్నియా మార్పిడి కోసం 15 లక్షలకు పైగా అంధులు వేచి ఉన్నారని అన్నారు మానవతా దృక్పథంతో ఆలోచించి నేత్రదానం చేసి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలని కోరారు ఈ అవగాహన పొందిన యోగా శిష్యులు సానుకూలంగా స్పందించారు.