శిశు దుర్వినియోగ నివారణపై అవగాహన:* *జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.భవానిచంద్ర సూచనలతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య ఆధ్వర్యంలో శిశు లైంగిక దుర్వినియోగం, పిల్లలపై హింస నివారణపై సంగారెడ్డిలోని రిషి హై స్కూల్ లో ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యదర్శి– కమ్–సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య విద్యార్థులకు శిశు లైంగిక దుర్వినియోగం, శారీరక–మానసిక హింస, సెక్స్టింగ్, సైబర్ బులీయింగ్, ఆన్‌లైన్ ఎక్స్ప్లాయిటేషన్ వంటి ఆధునిక ప్రమాదాలపై సానుకూల అవగాహన కల్పించారు. పోక్సో చట్టం కఠిన అమలు, ఘటనలు జరిగిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 181 విమెన్ హెల్ప్‌లైన్‌లకు సమాచారం ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. భరోసా సెంటర్ ద్వారా బాధిత పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ మరియు పోలీసు సహాయం అందుబాటులో ఉందని తెలిపారు. పిల్లల రక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సమాజం మొత్తం బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిషి హై స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now