చీర్యాలలో తడి–పొడి చెత్తపై అవగాహన

**చీర్యాలలో తడి–పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం**

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం జూన్ 10

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల వార్డు కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద తడి చెత్త – పొడి చెత్త విభజనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నాగమణి స్వయంగా పాల్గొని కాలనీలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం చాలా అవసరమని, ప్రజలు ఈ చెత్తను వేర్వేరు డబ్బాలలో వేసి, చెత్త సేకరణ ఆటో రాగా అందులో వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా ఎన్నో వ్యాధులను నివారించవచ్చని, ఆరోగ్యంగా జీవించవచ్చని కమిషనర్ అన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాలనీల ప్రజల్లో పరిశుభ్రతపై మంచి అవగాహన ఏర్పడిందని మున్సిపల్ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now