*ఒంటిపై స్పర్శ లేని తెల్లమచ్చలపై అవగాహన*
*జిల్లా లెప్రసీ అధికారి అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సుధారాణి*
*ఇల్లందకుంట ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
ఒంటిపై స్పర్శ లేని తెల్ల మచ్చలపై అవగాహన కార్యక్రమాన్ని ఇల్లందకుంట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా లెప్రసీ అధికారిగా జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సుధారాణి అవగాహన కల్పించారు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఒంటిపై స్పర్శ లేని తెల్ల మచ్చలపై అవగాహన కల్పిస్తూ స్పర్శ లేనట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సంబంధిత డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోవాలని కోరారు కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల కలిగే తెల్ల మచ్చలను కూడా పూర్తిస్థాయిలో చికిత్స చేసుకోవాలని తెలిపారు సమాజంలో కుష్టి వ్యాధి పై ఉన్న అపోహలను తొలగించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు
లెప్రసీ ట్రీట్మెంట్ తో నూరు శాతం క్యూర్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు అలాగే ఈ నెలలో ఫిబ్రవరి 10వ తారీకు జరిగే జాతీయ నులి పురుగుల దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో అంగన్వాడి సెంటర్లో ఇవ్వాలని నులి పురుగులు నివారణ మాత్రలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసీదాస్, ప్రధానోపాధ్యాయులు జయ ప్రకాష్ , డాక్టర్ నిక్కత్,డాక్టర్ కళ్యాణ్ శ్యామల,శ్రీనివాస్ రోజా వైద్య సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు*