*ప్రభుత్వ దవాఖానలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం*
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ క్యాన్సర్ సంబంధిత లక్షణాలను గుర్తించడం, పరీక్షలు చేయించడం, ఆహార పదార్థాలు, రోజువారి వ్యాయామం, క్యాన్సర్ కారకాలైన పొగాకుకి దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చునని, సత్వరంగా చికిత్స తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఫరీదా, ఆర్ఎంఓ డాక్టర్ ఆర్ వెంకట్, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శిరీష , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణశ్యామ్, నర్సింగ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.