Site icon PRASHNA AYUDHAM

పోలీస్ కళాబృందం చే సైబర్ నేరలపై అవగాహన కార్యక్రమం

Screenshot 20251016 185333 1

పోలీస్ కళాబృందం చే సైబర్ నేరలపై అవగాహన కార్యక్రమం

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 16:

జిల్లా కేంద్రంలోని మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెపల్లి KGBVలో గురువారం రోజు ప్రేమలో మోసాలు, బాల్య వివాహాలు, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, మాచారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో జరిగింది.

షీ టీమ్స్ సభ్యులు WPC సౌజన్య, భూమయ్య విద్యార్థినులకు షీ టీమ్స్ సేవలు, టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సమయంలో Dial 100 ఉపయోగం గురించి వివరించారు.

పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్ మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్, మద్యం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉండాలని సూచించారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, ఉ.శేషారావు, PCs ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల ద్వారా విద్యార్థినులకు అర్థమయ్యే విధంగా సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ASI ప్రభాకర్ రెడ్డి, KGBV ప్రిన్సిపాల్ శ్రీమతి మైస కల మేడ, టీచర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version