హైపర్‌టెన్షన్ నివారణకు అవగాహన ర్యాలీ

**హైపర్‌టెన్షన్ నివారణకు అవగాహన ర్యాలీ— కుషాయిగూడలో ప్రత్యేక కార్యక్రమం**

మేడ్చల్ జిల్లా కాప్రా ప్రశ్నా ఆయుధం మే 17

ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. హైపర్‌టెన్షన్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్థానికంగా ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు, నర్సులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం జరిగిన అవగాహనా సదస్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీ. ఉమా గౌరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హైపర్‌టెన్షన్‌ను అదుపులో ఉంచేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి అత్యంత కీలకమని పేర్కొన్నారు. రోజూ క్రమంగా వ్యాయామం చేయడం, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, ధూమపానాన్ని నివారించడం వంటి విషయాలపై ఆమె చర్చించారు.జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ, “హైపర్‌టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్‌గా పరిగణించబడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే హృద్రోగాలు, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశముంది” అని ప్రజలను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీఈఏ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ గీతా, సహాయ సీఈఏ ఆఫీసర్ డాక్టర్ వినోద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కౌశిక్, కుషాయిగూడ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రామాదేవి తదితరులు పాల్గొన్నారు. వైద్య నిపుణులు హైపర్‌టెన్షన్ నివారణకు అవసరమైన జాగ్రత్తలపై పలు సూచనలు అందించారు.

Join WhatsApp

Join Now