*లిటిల్ స్కాలర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ*
–
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
కామారెడ్డి పద్మపాణి స్వచ్ఛంద సంస్ధ, లిటిల్ స్కాలర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లిటిల్ స్కాలర్ హైస్కూల్ నుండి నిజాంసాగర్ చౌరస్తా, జీవదాన్ పాఠశాల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 04 న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తారని, ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది క్యాన్సర్ తో చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు బాధపడుతున్నారని, క్యాన్సర్ లక్షణాలను మొదట గుర్తించి పరీక్షలు చేసుకుని మొదటి దశలోనే చికిత్స చేసుకోవడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ పాణి సొసైటీ డైరెక్టర్ స్వర్ణలత, కోఆర్డినేటర్ వినాయక్, గౌతమి, గోపాల్, వినోద్ లు పాఠశాల యాజమాన్యం పున్న రాజేశ్వర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.