పంటలలో పురుగు మందుల వాడకం అవగాహన సదస్సు
నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ బి సి ఐ ప్రాజెక్ట్ అసిస్టెంట్ మల్లేష్
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 21 ప్రశ్న ఆయుధం
సహజ వనరులు సమగ్ర శశారక్షణ పురుగుమందులు కొనుగోలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు ను పాతర్లపెల్లి గ్రామంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ నిధి నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (బీసీఐ ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పి.యూ. మేనేజర్ మల్లేష్ ఫీల్డ్ ఫెసిలిటర్ పెద్ది గణేష్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సహజ వనరులు,సమగ్ర సస్యరక్షణ పురుగుమందుల కొనుగోలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు తమ పత్తి చేనులో అంతర రక్షక ఎర పంటలు సాగు చేస్తూ పంట వైవిధ్యాన్ని పాటించాలని, సరైన పోషకాలు, సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన మోతాదులో వాడుకోవాలని,దుక్కి దున్నటం తగ్గించాలని, పశువుల పెంట,చెరువు మట్టి బయో ఫెర్టిలైజర్స్ వినియోగించి భూసారం పెంచుకోవాలని మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులు వాడాలని పూత కాత వంటి క్లిష్ట దశలలో సాలు విడిచి సాలు పద్ధతిలో నీటి తడులు అందించాలని,45 రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారి చేయకుండా వావిలాకు,వేప కషాయం తయారు చేసుకొని వాడుకోవాలని, ట్రైకోడెర్మా విరిడి, బవేరియా, సుడోమోనాస్ లాంటి జీవన ఎరువులు ఉపయోగించాలని, పంట ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటిన తర్వాత తక్కువ విష ప్రభావం కలిగిన పురుగుమందులను బొట్టు పద్దతిలో చేసుకోవాలని తెలిపారు పురుగుమందుల పిచికారి సమయంలో తప్పనిసరి సరైన పరికరాలతో సరైన వాతావరణ పరిస్థితుల్లోనే ,సరైన రక్షణ దుస్తులు ధరించి పిచికారి చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు పురుగుమందులపై శిక్షణ నైపుణ్యం కలిగి ఉండాలని, గర్భిణీ స్త్రీలు బాలింతలు పిచికారి సమయంలో వెళ్లినట్లయితే అనారోగ్యం అంగవైకల్యం వస్తుందని, వాడిన పురుగుమందు డబ్బాలను నిర్వీర్యం చేయాలని తద్వారా నీటి ఆవరణ వ్యవస్థ కాపాడవచ్చని పేర్కొన్నారు ఒకే గ్రూపుకు చెందిన పురుగుమందులను మళ్లీమళ్లీ స్ప్రే చేయకూడదని, అత్యధిక విషపూరితమైన పురుగు మందులు వాడకూడదని వాటికి ప్రత్యామ్నాయ పురుగుమందులను వాడుకోవాలని,అత్యంత విషపూరితమైన పురుగుమందులను(CMR, PAN గ్రూప్ పురుగుమందులు) దశలవారీగా తగ్గించాలని కోరారు రైతులు సేంద్రియ వ్యవసాయానికి రావాలని,పంటలో వచ్చే చీడపీడల నివారణకు అగ్నస్త్రం, దశపర్ణి కాషాయం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ,నిమస్త్రం, వంటి కషాయాలు వాడడం వల్ల పంటలో పురుగులు తెగుళ్లు నివారించుకోవచ్చని తెలపడం తెలిపారు, రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల రైతులకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు 40 మంది రైతులకు కషాయాలను అందించారు గ్రామస్థాయిలో ఉన్న రైతుల యొక్క ఇంటింటికి తిరుగుతూ బీసీఐ కరపత్రాలు పంచుతూ బీసీఐ యొక్క ఉద్దేశాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాతర్లపెల్లి గ్రామంలో 80 మంది రైతులు బిసిఐ ఫీల్డ్ ఫెసిలిటేటర్స్ మోహన్ రమేష్ వెంకటేష్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు