కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ ఆవరణలో పాడి గేదెల కొనుగోలు పై అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ ఆవరణలో పాడి గేదెల కొనుగోలు పై అవగాహన సదస్సు

— లోన్‌లు, సబ్సిడీలతో పాల ఉత్పత్తిదారులకు ఊరటనిస్తాం – అధికారులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 20 

 

కామారెడ్డి జిల్లా లోని

విజయ డెయిరీ ఆవరణలో శనివారం డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాడి గేదెల కొనుగోలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిల్క్ కలెక్షన్ సెంటర్ల అధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు.

జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిదారులకు తెలంగాణ బ్యాంక్ ద్వారా 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను సబ్సిడీతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు సకాలంలో అప్లికేషన్ ఫారములను సూపర్వైజర్ ద్వారా పూర్తి చేసి పంపేలా చూడాలని సూచించారు. అలాగే HDFC బ్యాంక్ ద్వారా కూడా రుణాలు, సబ్సిడీలు అందేలా చూడాలని తెలిపారు.

డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రుణాలు తీసుకునే రైతులు ముందుకు వస్తే వారికి సబ్సిడీతో కూడిన లోన్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పశువులకు కావలసిన దాణా సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్, లీడ్ బ్యాంక్ అధికారులు, జిల్లా DVAHO జేడీ, వివిధ BMCU ల అధ్యక్షులు, డెయిరీ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను కలిసి సదస్సు వివరాలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now