Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ ఫ్రీ పై అవగాహన సదస్సు

IMG 20240829 WA0436

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ ఫ్రీ పై అవగాహన సదస్సు

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 29, కామారెడ్డి :

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ & తెలంగాణ నవనిర్మాణ విద్యాసేన యంగ్ సైరన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ పై మేము సైతం, కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే కృష్ణయ్య ప్రసంగిస్తూ నేటి సమాజంలో యువత మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిస అవుతూ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని కష్టపడి చదివిస్తున్నారని కావున విద్యార్థులు సన్మార్గంలో నడుచుకొని ఉన్నతంగా ఎదగాలని, మాదకద్రవ్యాలను బారిన పడకుండా విద్యార్థుల జీవితాలను, కుటుంబాలను కాపాడుకునే బాధ్యత విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు యువతరమే… యంగ్ సైరనే ఈ మహోద్యమానికి ముందుండి నడపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య, ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ ఏ. సుధాకర్, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, డాక్టర్ జి శ్రీనివాసరావు, డాక్టర్. రాజ్ గంభీరావు సమన్వయకర్త వినయ్, షీ టీమ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిస్కాలర్స్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version