*ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన*
*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ ప్రారంభం*
*మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ*
*ఇల్లందకుంట మే 7 ప్రశ్న ఆయుధం*
బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజనూరు క్లస్టర్ రైతువేదిక నందు పామ్ ఆయిల్ సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రతి రైతు తన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకొని మండలంలోని తమ క్లస్టర్ పరిధిలో గల రైతు వేదికకు వచ్చి రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి నమోదు రైతులను కోరారు పామాయిల్ ఇతర ఉద్యానవన పంటలో ఉన్నటువంటి సబ్సిడీ ల గురించి డివిజన్ ఉద్యానవన అధికారి మంజువాణి సంప్రదించాలని రైతులకు మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ఉద్యానవన డివిజన్ అధికారి మంజువాని వ్యవసాయ విస్తరణాధికారి రాకేష్ , లోహియా ఎడబుల్ ఆయిల్ కంపెనీ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు