*అంతర్జాతీయ సహకార వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన*
*జమ్మికుంట జూలై 4 ప్రశ్న ఆయుధం*
భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ 4వ వార్షికోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు సహకార వ్యవస్థ పరిచయం పై అవగాహన సదస్సు నిర్వహించారు శుక్రవారం జమ్మికుంట పట్టణంలోనీ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025 అవగాహన కార్యక్రమంలో జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ తో కలిసి మాజీ తెలంగాణ రాష్ట్ర సహకార అధ్యక్షుడు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు హాజరై వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో హేమలత,ఆఫీసర్ ప్రసన్న , సింగిల్ విండో డైరెక్టర్ లింగయ్య ,సీఈవొ రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ సదానందం ఉపాధ్యాయులు విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.