Site icon PRASHNA AYUDHAM

మహిళల భద్రతకు జిల్లా షీ-టీమ్స్, భరోసా ఆధ్వర్యంలో అవగాహన

IMG 20251220 194953

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం షీ-టీమ్స్-మొర్గి మాడల్ స్కూల్, భరోసా టీం- పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట నందు విద్యార్థులకు మహిళా భద్రత, ఈవ్-టేసింగ్, పోక్సో, అత్యాచార కేసుల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని, మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల లైంగిక వేధింపులు, ఈవ్-టీసింగ్ వంటి సమస్యల నుండి విముక్తి కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. షీ టీం బృందాలు స్కూల్స్, కాలేజీలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ వంటి జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ఎంచుకొని, నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. భరోసా సిబ్బంది విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాక్ టచ్, యుక్త వయసులో చేసే పొరపాట్లు, వాటి వలన కలిగే అనార్ధల గురించి, పోక్సో అత్యాచార కేసులలో బాదితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మహిళలు, బాలికలు మౌనాన్ని వీడి, నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మహిళలు ఎలాంటి వేదింపులకు గురైన వెంటనే జిల్లా షీ-టీం నెంబర్ 8712656772 కు కాల్ ద్వారా గాని వాట్స్ యాప్ ద్వారా గాని సమాచారం అందించాలని, పిర్యాది వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.

Exit mobile version