ఎస్పీ కార్యాలయంలో ఆయుధపూజ

కామారెడ్డి జిల్లా సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.విజయదశమి నుండి అన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు

 జిల్లా ఎస్పీ సింధు శర్మ ,

కామారెడ్డి జిల్లా సాయుధ దళాల కార్యాలయంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ , ఐపిఎస్  దుర్గదేవి అమ్మవారి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు, మరియు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలో అధికారులు సిబ్బంది విజయం సాధించాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

శాంతిభద్రల పరిరక్షణలో నేరాల నియంత్రించడంలో జిల్లా పోలీస్ శాఖ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు, దుర్గమాత కరుణాకటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగిందని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం అలనాటి నుంచి వస్తున్న సంప్రదాయం సమాజంలో చెడును పారదోలెందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పి యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది మరియు సాయుధ దళ పోలీసులు, పోలీస్ మోటారు వాహనాల చోదకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now