హోమియోపతి యోగా కేంద్రంలో ఆయుర్వేద ఆరోగ్య శిబిరం
(ప్రశ్న ఆయుధం)
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ సెప్టెంబర్ 23
ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని ఆయుష్ విభాగం డైరెక్టర్ , వరంగల్ ఉప సంచాలకుల ఆదేశాలతో కామారెడ్డి పరిధిలో లోని హోమియోపతి యోగా కేంద్రంలో ఆయుర్వేద ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మంగళవారం ధన్వంతరి పూజతో ప్రారంభించారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, నరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం, జ్వరం, చర్మ సంబంధిత వ్యాధులు మరియు ఇతర సమస్యలకు వైద్యులు విచ్చేసిన ప్రజలకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి డా. వెంకటేశ్వర్లు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, డా. ఉమాదేవి, డా. నీలిమ, డా. మాలిక జునైదీ, డా. దేవయ్య, డా. కీర్తన, డా. రాగసుధ, డా. హారిక, ఫార్మసీ సిబ్బంది, యోగా శిక్షకులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.