Site icon PRASHNA AYUDHAM

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని జిల్లా కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ

IMG 20250807 WA0017

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని జిల్లా కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 7.

 

కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లోని మౌలిక వసతులను మరియు రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు..

* ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే నీటి వసతి కల్పన గురించి కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించినారు

* రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు..

* రాత్రి వేళల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన సముదాయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు వారిని ఆదేశించారు…

* ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి కు వచ్చే రోగుల యొక్క ఔట్ పేషంట్ వివరాలు రోజువారీగా నివేదికలు రిజిస్టర్ లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు..

* కావలసినటువంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించినారు..

* ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి దోమకొండ డాక్టర్ ప్రభు దయా కిరణ్ మరియు మండల వైద్యాధికారి డాక్టర్ జోహార్ ఇతర వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు..

Exit mobile version