*అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి*
కేరళ రాష్ట్రం కొట్టాయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకకు చెందిన యాత్రికులతో బస్సు శబరిమలకు బయల్దేరింది. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో బస్సు కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి గ్రామ సమీపంలోకి రాగానే మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. సుమారు 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.