Site icon PRASHNA AYUDHAM

అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు ప్రారంభం

IMG 20251121 WA0010

అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు ప్రారంభం

36వ మండల పూజ, మహా చండీయాగం

నిత్య అన్నదానంతో భక్తుల సందడి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21: 

అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి జనవరి 14 వరకు జరగనున్న మండల పూజా మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారి ప్రత్యేక పూజలు, మహా చండీయాగం, నిత్య అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్వామి అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప సేవా సమితి సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, నస్కంటి శ్రీనివాస్, గోనే శ్రీనివాస్, పట్నం రమేష్, విశ్వనాథుల రాజేందర్, కూర శ్రీనివాస్, పబ్బ వేణు, పంపరు లక్ష్మణ్, మోర్టూరు శ్రీనివాస్, మొగిలిపల్లి భూమేష్, నీలరాజు యాద, అంజయ్య, నర్సింలు, నక్క శ్రీనివాస్, వెంకటేష్ శ్రీనివాస్ తదితర భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version