Site icon PRASHNA AYUDHAM

పిల్లలకు చట్టలపైన అవగాహన ఉండాలి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): పిల్లలకు అన్ని చట్టలపైన అవగాహన ఉండాలని, అందరు క్రమశిక్షణగా ఉండాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ తెలిపారు. బుధవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర ఆదేశాల ప్రకారం బుధవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల, కాశీపూర్ లలోని కేజీబీవీలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవంలో బాగంగా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ మాట్లాడుతూ.. పిల్లలకు అన్ని చట్టలపైనా అవగాహన ఉండాలని, అందరు క్రమశిక్షణగా ఉండాలని తెలిపారు. న్యాయ వ్యవస్థలో ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అన్నారు. గృహ హింస, బాల్య వివాహ నిషేధ చట్టం, పోస్కో చట్టం, వరకట్న నిషేధ చట్టాలపై అవగహన కలిగి ఉండాలని సూచించారు. మంచి చదువులు చదివి ఉన్నత ఎదుగుదల ఎదగాలని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరితే న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డిని సంప్రదించాలని సూచించారు. పిల్లలకు నిర్వహించిన వ్యాసరచన పోటీలు బహుమతులు అందజేశారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version