డిపిఆర్ఓగా బి.తిరుమల బాధ్యతలు స్వీకరణ

డిపిఆర్ఓగా బి.తిరుమల బాధ్యతలు స్వీకరణ

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డిపిఆర్ఓ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16

 

కామారెడ్డి జిల్లా నూతన జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా బి.తిరుమల గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేశారు.

 

కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా వివిధ ప్రచార మాధ్యమాలతో సమన్వయం చేస్తూ చురుకైన విధానంలో పనిచేయాలని సూచించారు.

 

ఇంతకుముందు అదిలాబాద్ జిల్లా డిపిఆర్ఓగా విధులు నిర్వహించిన బి.తిరుమల, బదిలీపై కామారెడ్డి జిల్లాకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment