ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
అంటరాని తనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైన అవమానాలకు ఆయధంగా మలచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ సంక్షేమ శాఖ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో కలసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, అబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ ఒక్క రోజే కాదని ప్రతి రోజు ఆ మహానీయుని తలచుకోవాలని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఎవరికి ఎవరు తక్కువ కాదని సమతావాదాన్ని చాటి చెప్పిన మహా మేధావి అంబేద్కర్ అని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన అన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరి వాడని చెప్పారు. సమాజిక ఆర్థిక రంగాలకు ఎన్నో సేవలు అందించారని, ఆర్బిఐ ఏర్పాటుకు మూలకారకులు అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్ జయంతి మనందరికి పెద్ద పండుగ అని చెప్పారు. మహానీయుల సిద్దాంతాలు నేటి తరాల వారు తెలుసుకోవాలని తెలిపారు. మనందరి అరాధ్యదైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు. మానవాళికి దిశానిర్ధేశం చేసిన మహానీయుడు అని కొనియాడారు. మానవాళి జీవన మనుగడ ముందుకు సాగేందుకు ఆయన జీవితం ఆదర్శమని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అన్ని రంగాలకు ఆరాధ్యుడని చెప్పారు. సామాజిక రుగ్మతలను అనుభవించి భావితరాల భవిష్యత్తుకు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారని చెప్పారు. చదువే మార్పుకు మూలమని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలని చెప్పారు. చదువు మనిషికి మూడో నేత్రమని కలెక్టర్ అన్నారు.బిఆర్.అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి భారత గడ్డపై ఉండడం ఎంతో గర్వ కారణమన్నారు. బిఆర్.అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఎనలేని సంపద రాజ్యాంగం వల్లనే మనమంతా ప్రజాస్వామ్యంలో బలంగా నిలబడగలిగామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అనసూర్య, హనుమంతరావు సూపర్డెంట్ , ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్, ఉత్సవ కమిటీ సభ్యులు కమిటీ కన్వీనర్ మారపాక రమేష్, కో కన్వీనర్లు కొప్పరి నవతన్ కుమార్, వేమూరి లక్ష్మి భాయ్, సంభారపు నాగేందర్, కనుకుంట్ల నిర్మల, మెదని లక్ష్మీ బాయి, ఎంట్రీ భార్గవి, కూరపాటి రవీందర్, కమిటీ మెంబర్లు బడిలక పుష్పలత, సిరిమల్లె కుమారస్వామి, కర్ష రత్నకుమారి, రెంటపల్లి మాధవి, గంధం కల్పన, మద్దెల సాయి సుధీర్, కొచ్చర్ల కమలా రాణి, సొల్లు రవి కిరణ్, దాసరి శ్రీనివాస్, బొమ్మెర శ్రీనివాస్, బొంకూరి పరమేష్, మోదుగు జోగారావు, సిరిగిరి మురళి, కొప్పుల సంజయ్ మహారాజ్, పాలెపు దుర్గేష్, కుంపటి నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.